సముద్ర తీరం చూచుటకూ
అమ్మ వాళ్ళతో వెళ్ళాము
పెద్ద పెద్ద అలల ఘోషా
మొద్దబ్బాయికి భయమే వేసే!
ఇసుకలోను ఎండ్ర కాయలు
ఇటు అటు పాకే చిన్నజీవులు
గవ్వలు,శంఖాలున్నాయి
పడవలు,వలలూ ఉన్నాయి !
ఎంత భయమో ఈ జలధి
యుగ యుగాల వాన నిధి
ఎండకి వెళ్లిన నీటి ఆవిరే
మేఘమునందు వర్షాలు !
హైలెస్సా అని జాలరులు
తెప్పలో వేటకి వెళ్లారు
ఒడ్డున ఉంది లైట్ హౌసు
చీకట్లోన దారి చూపు !
పల్లీ,సమోసా తిన్నాము
చెలిమలో నీరు తాగాము
ఒంటె, గుర్రం ఎక్కాము
పదిరూపీకే మహారాజై !
పసుపు,కుంకుమ తాంబూలం
అమ్మ జలధిలో వేసినది
అందరు దండం పెట్టాము
గవ్వల హారం కొన్నాము !
సముద్ర స్నానం జాగ్రత్త
చిన్న అలలలో చేయండి
చేయి చేయి పట్టుకొని
కాలికి పట్టు చూసుకొని !
సముద్ర తీరం బాగుంది
మళ్ళీ రమ్మని అడిగింది !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి