*పగ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.పగ రగిలే సెగ!
   కళ్ళు మండించే పొగ!
   వైరం ప్రథమ మూలం!
  బతుకు అనుక్షణం ఘోరం!
  తిండి లోపలికి పోదు!
  కంటికి నిద్దుర రాదు!
2.నిన్ను దొలిచే పురుగు!
   బతుకపుస్తక చెదపురుగు!
   జీవనవనాన చీడపురుగు!
  జాతికి నేడున్న విషపురుగు!
3.పగ ఆదిలోనే తుంచు!
  కాకుంటే వటవృక్షమై నిలుచు!
  ఊడలతో స్థిరత్వం పెంచు!
  ఆఛాయలో,
  మానవత్వబీజాలు,
  మౌనం వహించు!
4.పగతో జాతులే నశించాయి!
   బహుమూల్యం చెల్లించాయి!
   పగపట్టినవాడు కసితో,
  తొడకొట్టొచ్చు,పడగొట్టొచ్చు!
  వాడు మండుతున్న కట్టే!
5.పగే తెలియని భూమిని,
    పగ కన్నీళ్ళతో, కాకుంటే,
  రక్తంతో ఎన్నిసార్లు తడిపిందో!
 జీవనసుధాభాండం జారింది!
మానవకథ వ్యధై ముగిసింది!
*క్షమ*
 నడవడికి నాణ్యమైన నగ!
 జీవనపథాన కనుగవ!
 కీర్తి సౌధానికి ఆధారశిల!
ఏకైక విజయసాధనం ఈ ఇల!

కామెంట్‌లు