అమృతవర్షిణి :-మచ్చ రాజమౌళి దుబ్బాక (సిద్దిపేట జిల్లా)

 తొణకని అనకువనూ
తొలిరోజునుంచే నేర్చుకున్నదీ
అహరహము, అనుబంధాల గ్రంథాలను
పేగు బంధమై పెనవేసుకున్నది
ఓర్పు, నేర్పుల కూర్పులతో
మనసులను స్పృషిస్తూ మధురభాషిణిగ తళుకులీనుతున్నది
ఆమె, వ్యక్తిత్వము ఉన్నతము 
ఆమె, ఔన్నత్యము అత్యుత్తమము
సడి చేసే అనురాగ తరంగాల తరుణి
ఆమె, ఇలలో వెలిసిన అమృతవర్షిణి
             

కామెంట్‌లు