లక్ష్మి నివాసం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  ఒకసారి లక్ష్మిదేవి భూలోకం వచ్చింది. ఎవరింట్లో ఉండాలా అని ఆలోచిస్తూ ఉంది.  బిక్షగత్తె  వేషం వేసుకుని  సోమయ్య ఇంటిలోకి వెళ్ళింది. సోమయ్య ఒట్టి సోమరి. పనికి మాలిన దద్దమ్మ. పైగా పరమ పిసినారి. పిల్లికి  బిచ్చం వేయడు. ఎంగిలిచేత్తో కాకిని అదిలించాడు. "పో పోవమ్మా పొద్దున్నే" అంటూ బిక్షగత్తె రూపంలో ఉన్న లక్ష్మిదేవిని కసిరాడు. లక్ష్మిదేవి అక్కడ నుండి వెళ్ళిపోయింది.   ప్రక్కనే ఉన్న రామయ్య ఇంటికి వెళ్ళింది. రామయ్య కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. పేదలను ఆదరణగా చూసేవాడు. తనకున్న దానిలోనే కొద్ధోగొప్పో దానం చేసేవాడు. ఉన్నదానిలో సర్దుకుపోతూ తృప్తిగా జీవించేవాడు.  బిక్షగత్తె రూపంలో ఉన్న లక్ష్మిదేవి ఇంటి ముందుకు వచ్చే సమయానికి ఏదో పనిలో వున్నాడు. అయినా  ఆ పని వదిలేసి వచ్చి  బిక్షంవేసి వెళ్ళాడు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. లక్ష్మిదేవి రామయ్య ఇంట్లోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైతే పేదలను కనికరంగా చూస్తారో, కష్టపడి పనిచేస్తారో వారి  దగ్గరే లక్ష్మి దేవి ఉంటుంది.  సోమరులు, నిద్రబోతులు, పిసినారుల వద్ద క్షణం సేపు కూడా  ఉండదని  అర్ధమవుతుంది కాదు.