శక్తి--యుక్తి...!!:-డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మకొండ

 శ్రమించాలిగానీ 
శ్రమించేమార్గాలు 
కొకొల్లలు ....
దానికిదే ఆనవాలు !
ఆమె ...
ఎందులోనూ 
తక్కువకాదు 
దేనికీ వెనుకాడేది కాదు 
శక్తిని ధారవోసి 
యుక్తిగా సంసారం నడుపగల 
దూరదృష్టి అమెది ...!
ఇటుకరాళ్లేకాదు ...
ఇనుప దిమ్మలు కూడా 
మోయగల సామర్థ్యం అమెది !
పగటి శ్రమదోపిడీని ..
రాత్రి చీకటి బూచీని ...
మానసింకంగా ఎదుర్కోగల 
మానవీయ మనీషి ఆమె ...!
మాదిరి మహిళామూర్తి ఆమె !!