మనిషి నోట మాటలు మారుతున్నాయి
వీణల్లో రాగాలు కాలంలో రుతువులు మారుతున్నట్లు
మంచుగడ్డ కట్టినట్లు రక్తం గడ్డ కట్టుకు పోతుంది
గుండెలు పగిలి నల్ల రేగళ్ల లా నోరు తెరుచుకుని ఆకాశం వంక చూస్తున్నాయి
ఎక్కడో పొలికేకలు జనన మరణాల రాకపోకలకు సందేశాలు పంపుతున్నాయి
ఆగి ఆగి ఆడతనం అడవిలోకి దారి వెతుక్కుంటూ ఉన్నట్లు
మేఘాల నీడలా మగవాడు వెంట పడుతున్నట్లు
నీలి ఆకాశం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతుంది.
కాపాడేవాడు వీరుడు కాదు కాలం చేసిన వాడే వీరుడు!?!?!?
అఘాతంలోఆర్తనాదాలు వినిపిస్తున్నా సముద్రం మాత్రం భూమిని మింగుతూ ఆక్రమించుకుంటుందీ
నిజంగానే గాలి వెనక్కి తగ్గింది ఎత్తయిన పర్వతాల్లో లోతైన సముద్రం లో లా
కాలినడకన నరకాన్ని కాదు స్వర్గాన్ని చేరిన
సీతాకోక చిలుకలు ఆకలి కొనడం తప్ప
పూలు పూసింది లేదు పరిమళాలు వెదజల్లింది లేదు!?
వెనక్కి వెళ్లాలని అనుకున్నా గుండ్రని భూగోళంలా
తప్పించుకోలేని వృత్తాంతం అంతా వృత్తాలలో తిరగాల్సిందే .
రంగులేని నీరు వంగి వంగి నమస్కరిస్తున్న ది నింగి రాక కోసం కాదు నది రాక కోసం
ద్వారం మూసి ఉంచి నా గుండెల్లో గబ్బిలాల గందరగోళాలేం లేవు.
అవి గుహల్లోని అజంతా-ఎల్లోరా లే !?
ఒక్కసారి ఎగిరిచూడు నీకు నీవు ఎగిరిన పచ్చి నిజం తెలుస్తుంది
పక్షుల ప్రతిభలుపైకి తెలుస్తాయి.
విడిపోయిన మట్టి ఎడారి ,కలిసి ఉన్న చెట్లు మనిషికి చుట్టాలు
వెక్కి వెక్కి ఏడ్చిన వెనక్కి రాణి కాలం
ఒక కన్నీటి చుక్క కోసం మనిషిని సృష్టించింది ఆ మనిషి పుట్టించిన మమకారం ఒక ఆకారం లేని ప్రకృతి ప్రతీకారం కావచ్చు!!!!?
పగల గొడుతున్న పగటి గోడల్ని నిన్నటి మాటల్ని నిర్ధాక్షిణ్యంగా తొలగించి ,
కొత్త మధ్యాహ్నపు మందిరాల్నీ
సాయంత్రపు సమాజాల్నీ
ఉదయపు హృదయాల్ని సృష్టించడానికి కావచ్చు!!!!?
pratapkoutilya (( కె ప్రతాప్ రెడ్డి))
Lecturer in Bio-Chem
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి