ఎంత బాగుంటుంది !?:-సునీతా ప్రతాప్
మనకు ఉద్యోగం లేదు కాదు
ఉద్యోగం చేసే వాళ్ళ కోసం
మనకు ఉద్యోగం లేదు !?
ఎంత బాగుంటుంది!!?

మనం ఓడిపోయాం కాదు
వాళ్ళ విజయం కోసం 
ఓడిపోయాం !?
ఎంత బాగుంటుంది!?!?

మనం వెనకబడ్డాం కాదు
వాళ్ల కోసం మనం వెనకబడ్డాం
ఎంత బాగుంటుంది !?

వాళ్లు పేదవాళ్లు కాదు
మనకోసం
వాళ్లు పేదవాళ్లు అయ్యారు !?

వాళ్లు గాయపడ్డారు కాదు
మనకోసం
వాళ్లు గాయపడ్డారు !?
ఎంత బాగుంటుంది!?

వాళ్లు చనిపోయారు కాదు
మనకోసం
వాళ్లు చనిపోయారు!?
ఎంత బాగుంటుంది!?

వాళ్లు యుద్ధం చేస్తున్నారు కాదు
మనకోసం
వాళ్లు యుద్ధం చేస్తున్నారు !?
అనిఅనుకుంటే ఎంత బాగుంటుంది!?

Sunitapratap
Teacher
8309529273