*నిట్టూర్పు!*:-డా.సి.వి.ఎల్.సుబ్బారావు.

 1.బట్ట మరకా! బతుకుమరక!
  వేడినిట్టూర్పా!  వాడి నేర్పు!
 ఎగిసే అలుపా! ఎగిరే పరుగు!
  ప్రగతిగెలుపు! కొత్త చిగురు!
  వెనుకబడిన, మరి వెనకే!
2. *మందు* అడుగా!
                     ముందడుగా!
  జులాయా!
               ఝంఝామారుతం!
 పోకిరియా! ఉరికేతురంగం!
 మురికా! మెరిసే ముత్యం!
 వెకిలా! కలికితురాయి!
3.సోమరా! చైతన్యం!
   వెధవాయా! వైవిధ్యం!
   మందు తిన్న పామా!
        మహేశ్వరకంఠహారం!
   అమ్ములపొదాస్త్రమా!
        లక్ష్యం చేరే శరం!
4.మాటప్రాణం! నిలబెట్టు!
   కష్టంపుణ్యం! కూడబెట్టు!
   గొంగళిహీనం!
        సీతాకోకచిలుక నయం!
  భోగంతో బతకడమే!
    త్యాగంతో బతికిస్తావు!
5.మార్పు వైపు గమనం!
   అదే జీవన పురోగమనం!
  ఓర్పు తో సాగిపో!
   తీర్పు నీకు అనుకూలం!

కామెంట్‌లు