చెరువులో చేపలు (కథ):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

 సీతారాంపురం అనే ఊరి పక్కన ""చిలకమారి" కుంట అనే ఒక చిన్నపాటి చెరువు.
    అందులో రకరకాల చేపలు  ఆ చెరువు చుట్టూ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి .
ఆ చెట్ల పై కొంగల నివాసము
    రోజు ఉదయం చేపలు నీటి పైన ఆడే సమయంలో, కొంగలు చెట్టుపైనుండి చూసి, చేపలను వేట చేసి చంపి కడుపునిండా తింటున్నాయి.
 అలా కొద్ది రోజుల వరకు చేపల సంఖ్య క్రమంగా తగ్గి పోతుంది.
    చేపలన్నిటికి రా రాజు బంగారు రంగు చేప .
ఒక్కరోజు రాజు చేప, చేపల సంఖ్య తగ్గిపోవడం గూర్చి ఆలోచించి.
   చేపలన్నిటిని సమూహ పరిచి మిత్రులారా మీరు పదే పదే నీటిమీద ఎగిరి దూక కుండా నీటి అడుగు భాగంలోనే ఉండండి, రాత్రివేళ మాత్రం నీటి పైకి వచ్చి తిరగండి .అప్పుడుగాని కొంగలకు మనము దొరకం, అలా కొద్ది రోజులు మనము జాగ్రత్త పడితే, ఆ కొంగలు ఆకలికి తట్టుకోలేకే ఇచ్చటి నుండి వేరే చోటికి వెళ్లిపోతాయి. 
అప్పుడు  మనమందరం క్షేమంగా ఉంటామని, రాజు చేప చేపలతో చెప్పింది. ఆ రోజు నుండి  చేపలన్ని రాజు చెప్పిన ప్రకారమే మెదులుకున్నాయి. 
పాపం కొంగలు ఆకలితో అలమటిస్తూ, ఇక్కడ ఉంటే మనం బ్రతకలేమని వేరే చోటికి వెళ్ళి పోయినాయి
 అప్పుడు ఆ చెరువులోని చేపలన్నీ సంతోషంగా ఉన్నాయి. 
ఎప్పుడు కానీ  పెద్దలు చెప్పిన మాటలు సద్దన్నం మూటలు.