*క *గుణింతముతో కథ:- సత్యవాణి కుంటముక్కుల

 కన్న కథల పూస్తకం చూశాడు
కాకి కథవుంది అందులో
కిట్టుగాడి కథవుంది
కీటకం  కథవుంది
కుక్క కథ కూడావుంది
కూజా కొంగ   కథావుంది
కృష్ఞుడి కథవుంది
కౄరుడు  కంసుడి  కథకూడావుంది
కేటుగాడి కథ వుంది
కైక కోరిక   కథవుంది
కొక్కురోకో   కోడి  కథవుంది
కోమటి రామయ్య కథా వుంది
కౌరవుల కథ వుండనే వుంది
కంద బచ్చలి కథవుంది
కం కః కం కః అని పాడుకొంటూ
ఆఖరి కథవరకు ఆపకుండా చదివాడు కన్న