*జగదీష్ కు గాథ సృజన సంయమి పురస్కారం*


 జిన్నారం: తెలుగులో 25 మినీకథలు రచించినందుకు బొల్లారం జడ్పీ పాఠశాల 9వ తరగతి విద్యార్థి దాసరి జగదీష్ కు "గాథ సృజన సంయమి" పురస్కారం లభించినట్లు పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు.
      "మంచితనం, స్నేహం, పిల్లలు..దేవుళ్ళు, విడిచి ఉండలేను, దేవుని రూపం, అత్యాశ, అవినీతి, మూఢనమ్మకం, ఉపాధ్యాయుడి బాధ్యత, మానవత్వం, పెళ్ళికానుక, విగ్రహ విశిష్టత, తల్లిప్రేమ, ప్రాణవాయువు, సహనం, చావులో తోడు, ఆశయం, దుఃఖంలో నిర్ణయం, కృతజ్ఞత, పుస్తకం..మంచి నేస్తం, ఆశ- దురాశ, ప్రతిభ, కొడుకులో వచ్చిన మార్పు, పరివర్తన, నిజమైన బంధం" అనే శీర్షికలతో సందేశాత్మక కథలు రచించినందుకు జగదీష్ కు మంగళవారం నాడు ఉస్మానియా తెలుగు రచయితల సంఘం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ పురస్కారం అందజేశారు. 
      చక్కని కథలు రచించి చిన్న వయసులోనే "గాథ సృజన సంయమి" అనే పెద్ద పురస్కారం పొందిన దాసరి జగదీష్ ని ప్రధానోపాధ్యాయుడు మంగీలాల్, ఉపాధ్యాయులు, పట్టణవాసులు, తోటి విద్యార్థులు అభినందించారు.