ప్రేమ(ఇష్టపదులు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.ఇరు మనసులు కలిసిన‌ ఇష్టమై నడుచునది
ప్రమోదమానమై ప్రాముఖ్యం కలిగినది

ఒకరికోసమొకరుగ ఒట్టుగా నిలుచునది
గట్టి బంధమది యని గాఢత కలదియనియు

వాసికెక్కిన ప్రేమ వార్థి నిలుచుచున్నది
అజరామరచరితగ అమర ప్రణయము గాదె

తారతమ్యం లేని తారకమంత్రముగా
విశ్వాన్ని కదిలించి విజేతగా నిల్చెను

2.కులమతాలు లేనిది కుళ్ళు దరిచేరనిది
పవిత్రమైనట్టిది పావనచరిత కలది

అసామాన్యమైనది ఆదిమూలమైనది
ఇహపరాల కనువై ఈశ్వర ప్రీతియై

ఎదయెదలను కలుపుతు ఏలికయై వెలుగుతూ
కలిపి ఉంచే కలిమి     కామధేనువు తీరు

శక్తి రూపు కట్టిన శాశ్వత బంధముగా
విశ్వమానవ విహిత విజయ వినయ గీతిక