త్రిపదలు :-ఎం. వి. ఉమాదేవి
1.పల్లీలు,ఐస్ క్రీమ్ 
పిల్లల పెద్దలూ జనసంద్రం 
కడలి అందం అలలపాలు !

2.కోపం వొదిలేదాకా 
వొంట్లో వేడిగా 
మాటవిసిరాకే చల్లదనం !

3.తోట తెల్లమొహమేసింది 
పూలు తుమ్మెదలూ 
కుమ్మక్కు అయ్యాయని !

4.పెంచిన ప్రేమ తుంచలేదు 
   మాకేమిచ్చావు అంటే 
మౌనం సమాధానం !

5.కవిత్వం పలచ బడింది 
అసూయతో కవులు 
కార్చే కన్నీళ్లు తో !