రావోయి జాబిల్లి (తేనియలు):-ఎం. వి. ఉమాదేవి - నెల్లూరు

రావోయి జాబిల్లి ఇలా 
బంగారు వెన్నెలను ఇవ్వు  
నీలాల కొండల్లోనా 
రంగారు పువ్వులే  రువ్వు !

తెలిమంచు తెరలు సాగేను 
చెలి వలపు కథలు పదునులే 
మునిమాపుల  వేళనుండీ
చిరు సిగ్గుపొరలు వదులులే!

ఇది ఏమి ఏకాంతము ఇలా 
సడిలేని గీతాలు పాడే
రాధ మాధవ అమలిన ప్రేమ 
వేణు గానములే  వినపడే !

కామెంట్‌లు