అందాల బాలలు
అమ్మానాన్నల గారాలు
అపురూప వరాలు......
ఇష్టారాజ్యంగా పెరగాల్సిన బాల్యం
ఇటుకలు మోస్తూ బతుకు
భారంగా భరిస్తోంది......
ఆడుతూ పాడుతూ బడికి
వెళ్లాల్సిన బాల్యం
ఆయాసపడుతూ
బతుకు బండిని
బరువుగా లాగుతోంది......
చలాకీగా పలకా బలపం
పట్టాల్సిన చేతులు
చకచకా పట్టకారుతో
కుస్తీ పడుతోంది......
సునాయాసంగా అక్షరాలు
దిద్దాల్సిన చేతులు
సుత్తితో అతికష్టంగా
వేట్లు వేస్తున్నాయి .....
ఎన్నో అవార్డులు
పొందవలసిన ఆ చేతులు
ఎన్నెన్నో తినుబండారాల
విక్రయాల బాటకు
రహదారు లవుతున్నాయి.....
బాల్యమా ఎక్కడ
నీ చిరునామా?
కార్మికుల్లా అగచాట్ల
వలయం లోనా
అంధకార నిశీధి
బంధురం లోనా....
కాలుష్యం లేని
బాల్యం కావాలి
కల్మషం లేని
బాల్యం రావాలి
కష్టం లేని
బాల్యం కావాలి....
పూసిన ప్రతి పూబాలలు
ప్రగతి పధంలో
పూల తేరులా
పరుగులు తీయాలి...
విజ్ఞానం లో
అబ్దుల్ కలాంకు
సాటి రావాలి.....!!
(బాలల పీడిత దినోత్సవం సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి