కప్పల పత్రం (కథ):-ఎడ్ల లక్ష్మి సిద్దిపేట

   "పంచారామం" అనే గ్రామం ఆ గ్రామంలో పంచ గట్టు అనే చెరువున్నది. 
ఆ చెరువులో పెద్ద పెద్ద పచ్చ రంగు కప్పలు ఉన్నాయి.
  వాటితో పాటు అందమైన తామరలు, తుంగ పూలు, దుంపలు, చేపలు, జలపక్షులు కూడా ఉన్నాయి.
     ..................
ఎంత కరువు కాలం వచ్చిన కానీ ఆ చెరువు మాత్రం నీళ్ల తో "తొలికీస"లాడుతూ ఉండేది. 
    కానీ రాను రాను చెరువులో నీటి మట్టం తగ్గడము మొదలైంది. 
రాత్రి వేళలో ఆ పెద్ద కప్పలు గట్టుకు వచ్చి , ముచ్చటించుకుంటూ , చెరువులోని నీటి శాతం గమనించాయి. ఎందుకని ఈ చెరువులో నీళ్లన్నీ తగ్గిపోతున్నాయని చెరువుగట్టు చుట్టూ చూశాయి. ఇంకేముంది చెరువు చుట్టూ ఉన్న చెట్లు అన్ని కూడా నరికి వేసి కనబడ్డాయి. 
   ఇక్కడే కాకుండా, చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద చెట్లు నరుకుటవలన, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ చెరువులో నీరు తగ్గిపోతుందని కప్పలన్నీ ఆలోచించాయి. ఒకరోజు కప్పలన్నీ కలిసి సమావేశమై హరితహారం గూర్చి ఆలోచించాయి.
      *************
    ప్రతి ఒక్క కప్ప ఒక్క, మొక్క తెచ్చి చెరువుగట్టు చుట్టూ నాటాలి, నాటిన ప్రతి మొక్కకు పాదు చేసి నీరుపోసి పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి.
     ***************
  మరుసటి రోజు నుండి పచ్చరంగు కప్పలన్నీ పని ప్రారంభించాయి. మొక్కలు తెచ్చి నాటడం పాదు చేయడం నీరు పోయడం చేస్తూ, నాటిన మొక్కలను భద్రంగా పెంచాయి .
 
ఆ మొక్కలు పెరిగి వృక్షాలుగా మారి చక్కని నీడ, చల్లని గాలి, తో పాటు వానలు కురిశాయి.
     ..........
   వాగులు వంకలు పారి చెరువులోకి నీరు నిండుగా చేరింది.
అప్పుడు కప్పలన్నీ కలిసి ఒక పత్రం రాసి చెరువు గట్టుకు వేశాయి.
       ఎమినో!!
 ఓ  మానవులారా చెట్లను పెంచిన చో వానలు కురియును. 
చెట్లు నరికిన చొ ఎడారిగా మారును 
చెట్లు షప్రగతికి మెట్లు
         *********
అందుకని ప్రతి ఒక్కరు చెట్లను పెంచి ఈ ప్రకృతిని కాపాడండి . మీ క్షేమం కోరే మండూక సమూహం.