దంపతులు :-తెలుగు తేనియలు (ప్రక్రియ):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
సొంత రిక్షా అయితేనేమి 
పతికి శ్రమను చూడలేదుగా 
హోరున కురిసే వర్షంలో
తానే గొడుగును పట్టెను గా 

పరస్పర సాయం సంసార
వీణను చక్కగ పలికిస్తూ 
ప్రకృతికె వింతగ ప్రణయభావ
తరంగ రాగo  వినిపిస్తూ 

పనుల్లో అందే  తోడ్పాటు 
మనిషికే మహా శక్తి కదా 
ప్రతినిత్యo అదే అలవాటు 
చూచు వారికి ముచ్చటవదా !


కామెంట్‌లు