గడియారం:-సునీతా ప్రతాప్

మనుషుల్ని సృష్టించిన
మహిళ
ఒక గడియారం !!?

దిక్కుల్నీసృష్టించిన
తూర్పు పడమర లు
సృష్టి గడియారం !?

భూమి ఆకాశం గాలి
మధ్య
నీరు ఆవిరి
నీటి గడియారం!?

సూర్యుడి
వెలుగునీడలు
ఆకుపచ్చని
భూగోళపు గడియారం!?

ఒక గడియారం అడిగింది
ఎక్కడ మొదలైంది
ఎక్కడ ఆగిపోయిందని!?

ఎక్కడి గడియారం అక్కడే
ఏ ఒక్క గడియారం
ఒకే ఒక్క గడియారం కాదు!?
విశ్వ గడియారం
ఇప్పుడు మనిషి ఒక్కడే!?

Sunitapratap
Teacher palem
8309529273
కామెంట్‌లు