నవ్వవోయ్ చిన్న చిరునవ్వు
వెన్నెల కురిసి నట్లు
నందివర్థనం విచ్చుకొన్నట్లు
నవ్వవోయ్ మనసారా
పారిజాతాలు పరిమళించినట్లు
ప్రసూనాలు వికసించినట్లు
చిన్న చిరునవ్వు నవ్వవోయ్
చిరునవ్వు
చేయలేనిదేముంది
నవ్వవోయ్ చిన్నచిరునవ్వు
రాజీలను కుదురుస్తుంది
రాజ్యాలను నిలబెడుతుంది
రక్తపాతాలను నిలువరిస్తుంది
నవ్వవోయ్ చిన్న చిరునవ్వు
వెనన్నెల కురిసినట్లు
వెన్నను అలదినట్లు
నవ్వవోయ్
మనసారా
మనసుతీరా
నవ్వవోయ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి