రైలు కదులుతున్న సమయంలో లో ఇద్దరు వ్యక్తులు ఆ కంపార్ట్మెంట్లో కి ఎక్కారు.
ఆ అమ్మాయి కిటికీ పక్కనే కూర్చుంది.
వారికి ఎదురుగా భార్యాభర్తలు కూర్చున్నారు.
అతను అను మంచినీళ్ల బాటిల్ తెస్తా అని అని రైలు దిగాడు.
పది నిమిషాలు గడిచిన అతను రాలేదు.
ట్రైను కథల బోతున్నది ఆ అమ్మాయి భయంగా చూస్తున్నది.
అతను రాకపోయే సరికి ఆ అమ్మాయికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి.
ఎదురుగా ఉన్న పెద్దాయన ఆ పిల్లని గమనించాడు
పక్క కంపార్ట్మెంట్ లోకి ఎక్కి ఉంటాడులే వస్తాడు కంగారు పడవద్దని ధైర్యం చెప్పాడు.
నిజమే వస్తాడు అనుకొంది.
రైలు స్టేషన్లు దాటుకుంటూ పోతున్నది అతను మాత్రం రాలేదు.
అది ది జనరల్ కంపార్ట్మెంట్ కావటం అంతా పెద్దగా జనం లేరు
నీ పేరేమిటి అన్నాడు ఆ పెద్దాయన వైష్ణవి అన్నది.
ఆ పిల్ల మెడలో పసుపు తాడు లేదు కాళ్లకు బట్టలు లేవు అతనెవరు అడిగారు ఎదురుగా ఉన్న జంట.
వైష్ణవి నోరు ఓరు విప్పలేదు. ఏం చెబుతుంది ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చినట్లున్నారు. ఈ పిల్లని వదిలించుకోవాలని అతను వెళ్లి ఉంటాడు అంటూ వైష్ణవి వైపు చూశారు.
ఆ మాటలు వైష్ణవికి చెంప పెట్టు ల తగిలాయి. అంటే రాకేష్ నన్ను వదిలించు పోవాలని అనుకొన్నాడా.
వాళ్లు అనుకున్నది నిజమే కావచ్చు ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి అంటూ రెండు చేతులతో ముఖం దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇప్పటికైనా నా మించిపోయింది లేదు మీ వాళ్ళు నీకోసం ఇప్పటికే వెతుకుతుంటారు ఇంటికి వెళ్ళు
. ప్రేమించిన వాడు నిన్ను మోసం చేశాడు ఇప్పటికైనా నిజం తెలుసుకో జరిగింది అంతా మీ తల్లిదండ్రులకు చెబితే మంచిది
ఇంకెప్పుడూ ఇలాంటి పని మంచిది కాదమ్మా.
నీకు అంతగా భయమైతే చెప్పు మేమే నీ తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు.
వైష్ణవికి రాకేష్ మనస్తత్వం అర్థమైపోయింది మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడింది.
రాకేష్ వైష్ణవిని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని అన్నవరం వెళ్దామని చెప్పి తీసుకువచ్చి ఆమెని రైల్లోనే వదిలేసి వెళ్ళాడు.
హైదరాబాద్ వెళ్లే రైల్లో దీప్తి తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
దీప్తి బాగా ఆస్తిపరులు రాలు అందుకే ఆమెని పెళ్లి చేసుకోవాలని దీప్తి తో పరిచయం పెంచుకున్నాడు మెల్ల మెల్లగా దీప్తి కి దగ్గరయ్యాడు.
దీప్తి తనకోసం ఎదురుచూస్తూ ఉంటుందని హైదరాబాద్ వెళ్లే ట్రైన్ లో ఎక్కాడు ఆమె చెప్పిన భోగి అంతా వెదికాడు ఎక్కడ అ దీప్తి కనిపించలేదు ఫోన్ చేశాడు.
నేను నేను మా బావతో ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోతున్నాను నా కోసం ఎదురు చూడవద్దు ఇన్నాళ్లు టైం పాస్ కోసం నిన్ను ప్రేమించినట్లు నటించి బాడీగార్డ్ లా అలా వెంట తిప్పుకున్నాను.
పాపం నిజంగానే ప్రేమించాను అనుకున్నావు పిచ్చి వాడివి.
ఈ లవ్ గేమ్ లో నిన్ను పావుల ఉపయోగించి కొన్నాను.
అంటూ ఫోన్ పెట్టేసింది రాకేష్ పిచ్చి వాడయ్యాడు నిజంగానే దీప్తి లవ్ గేమ్ తనని పావులా వాడుకుంది.
పాపం వైష్ణవి నన్నెంతగానో నమ్మి ప్రేమించింది వైష్ణవి మోసం చేశాను అందుకే నేను మోసపోయాను.
నాకు తగిన నా శాస్తి జరిగింది వైష్ణవి ఎక్కడుందో అనుకుంటూ ప్లాట్ ఫామ్ మీద పరిగెడుతూ ఉన్నాడు అప్పటికే ట్రైను వెళ్ళిపోయింది.
వైష్ణవి.: -తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి