అమ్మ నుదిటిన మెరిసే సింధూరమే
అలుపెరగని ఆదిత్యుడిలా
త్యాగాల సుమగంధంగా
నవ మాసాలు మోయని జన్మ జన్మల పెన వేసిన అనుబంధం...
అందమైన లోకాన్ని అత్యద్భుతంగా చూపించి...
అంచెలంచెల ఎదుగుదలకు నిలువునా నిచ్చెనై
అడిగినవన్ని కాదనని కామధేనువే
బాధ్యతల బరువుతో పగలు రేయి కష్టించి
కంటికి రెప్పై కాసేటి వెలుగుల సూరీడు....
ఆశల నావకు చుక్కానిగా...
మెరిసేటి తొవ్వల నడిపించి
బతుకున బంగరు బాటలు పరిచి
ఆత్మస్థైర్యం నింపే అనంత దైర్యమే
అనురాగ ఆప్యాయతలతో
మమతల కోవెలనల్లిన మౌనః మునీశ్వరుడు....
నడకతోటి నడవడికలు నేర్పి
నిత్యం వెన్నంటిన ప్రోత్సాహమే
నమ్మకానికి నిదర్శనమై త్యాగాల చిరునామాగా...
చిరునవ్వుల చిరుగాలిలా...
లక్ష్యమందించే తొలి నేస్తమై
నవ్వుల నజరానాలెన్నో అందించేది నాన్న...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి