1.మూడురంగుల జెండా మూలమై నిలువగను
సామ్యవాద సారం స్వాతంత్ర్య హారం
భరతమాత నివాస భాగ్యమై కనబడగా
వేదభూమి యనగా వేడ్కతోడ కనుమా
శాంతిదూతగ నిల్చి శాంభవిగ కరుణించి
నిను మోసే తల్లీ నీ భారం వహించె
దేశము చిరునామా దేహము సమర్పణము
పుట్టినా గిట్టినా పులకించుదును నేను
2.నాక నివాసం ఇది నా దేశం గొప్పది
కమనీయ చరిత గల కార్యక్షేత్రం ఇది
సాధుపుంగవులతో సాహసవీరులతో
అలరారిన అమృత ఆర్షభూమిదియేను
ఇతిహాసముల కన్న ఈశుడుండే చోటు
భరతదేశము కన్న గొప్ప దేశము గలదె?
పుణ్యభూమి ఇదియే పూజ్యనీయ కనగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి