👌 ధర్మ రాజు కాలుడు
యముడు పెతరుల రేడు
దక్షిణ దిశకు ప్రభువు
ఓ తెలుగు బాల!
* * * * *
👌"యముడు" అనగా దండించు వాడు. యమమును (లయమును) పొందించు వాడు.
👌అపరాధులను శిక్షించి, ధర్మమును రక్షించు ప్రభువు. "ధర్మ రాజు!
👌ఈ చరాచర ప్రపంచ సృష్ఠి లో.. ధర్మాధర్మముల నైన, ఆయువు నైన.. లెక్కపెట్టు వాడు. కనుక "కాలుడు" అని పేరు!
* * * * *
( యమ ధర్మ రాజు.. దక్షిణ దిక్పాలకుడు.."దక్కిణంపు సామి"! పితృ పతి.. పితృ దేవతలకు ప్రభువు - "పెతరుల రేడు"! దండ పాణి.. కాల పాశ మనెడు దండమును దాల్చిన వాడు -"గుదె తాల్పు" అని, అచ్చ తెలుగు పదాలు. )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి