మత్తేభము:
*లేవో గానల కందమూల ఫలముల్ | లేవో గుహల్తోయముల్*
*లేవో, యేరులపల్ల వాస్తరణముల్ | లేవో, సదాయాత్మలో*
*లేవో నీవు విరక్తులన్మనుపజా | లిం బొంది, భూపాలురన్*
*సేవల్సేయగ బోదురేలొకోజనుల్ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
అడవిలో తినడానికి పండ్లు వున్నాయి. వుండానికి వీలుగా గుహలు వున్నాయి. తాగడానికి ఏటిలో, కొలనులో నీళ్ళు వున్నాయి, నీ పూజ చేసుకోవడానికి కావలసిన పత్రి దొరుకుతుంది. చివరి దశలో వైరాగ్యం కలిగితే రక్షించడానికి నీవు వున్నావు. నీవు కల్పించిన ప్రకృతిలో ఇన్ని వున్నా, మా మనుషులు రాజుల దగ్గర ఉద్యోగం చేయడానికే ఇష్టపడతారు, ఎందుకనో?......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*శివా! మహానుభావా! కాలకూటవిషధరా! హరా! మా మనుషులము, పరుల సేవ చేయడం లో ఎంతో ఆనందాన్ని పొందుతాము అనుకుంటారు. కానీ, నీ సృష్టిలో కొదవ ఏమి వుంది, దయామయా! నీవే యివ్వలనేది, వేరొకరు ఇవ్వగలగుతారు అని మేము భావించడం, నీ ఆటలో, మాయలో భాగం కాక ఇంకేమిటి, సదాశివా! మా కర్మ చక్షువులు గుర్తించలేక గానీ, లేకపోతే, మా చుట్టురా నీ యందు మనసు నిల్పడానికి అవసరమైన వస్తు పదార్థాలు అన్నీ ఏర్పరచి పెట్టావు,కదా ! గంగాధరా! గాలీ, నీరు, గూడు, ఫలం, పుష్పం అన్నీ, అన్నీ నీవు సమకూర్చి ఎట్టినా, ఇంకా ఏదో సంపాదించాలి, నాది అనేది ఏర్పరచుకోవాలి అని మేము నీ మాయ వెంట పరుగెడుతునే వుంటాము. ఈ పరుగులో అలసిన వేళలా, ఆకటి వేళలా మాకు నీవే దిక్కు గదా, సుబ్రహ్మణ్యేశా! మేము ఎల్లప్పుడూ నిన్ను మరువకుండా, నీ స్ఫురణలోనే వుండేటట్లు మమ్మల్ని నీవే నడిపించాలి,తండ్రీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి