👌సూర్య రూపుడు శివుడు
త్రయీ మూర్తి, అభవుడు
భర్గుడు, ఈశానుడు
ఓ తెలుగు బాల!
👌పరమేశ్వరుడు.. పంచ మహా భూతము లలో.. ఆరవ దైన "సూర్యుని" స్వరూపం లో విరాజిల్లు చున్నాడు. "ఈ శా న" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
👌 సాంబ శివుడు.. త్రి మూర్త్యాత్మకుడు. వేద వేద్యుడు. బ్రహ్మ - విష్ణువు - మహేశ్వరులను..మూడు మూర్తులు గాను; ఋగ్వేదం - యజుర్వేదము - సామవేదము - లనెడు... మూడు రూపములు గాను కలవాడు. కనుక, "త్రయీ మూర్తి". ప్రమాణ త్రయము చూపు నట్టి, దివ్య మంగళ స్వరూపుడు. తేజస్సు లకు ..దివ్య తేజోమయ రూపుడు. కనుక, "భర్గుడు".సర్వ శక్తి మంతుడు.. శివుడు.
👌 "ఈ శా ను" డనగా.. మహ దైశ్వర్య యుక్తుడు. అణిమా, మహిమా గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము... అనెడు; అష్ట (8) విధము లైన ఐశ్వర్యములు కలవాడు. వాటిని ఆరాధకులకు, మరియు సాధకులకు అనుగ్రహించు వాడు.
కనుక, "ఈ శా ను డు"... అష్ట మూర్తు లలో ఆరవ వాడు.
* * * * *
( శ్రీ ఉమా మహేశ్వరు డే... అష్ట మూర్తి యైన జగ దీశ్వరుడు. అందు వలన, ఆగమ వేత్త లైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివ లింగ మూర్తి యైన స్వామి వారిని.. "ఓం ఈశానాయ, సూర్య మూర్తయే నమః"! అని, పత్రములు, పుష్పము లతో పూజించు చున్నారు! )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి