పీతాంబరం ఇస్తారా ఎవరన్నా... అది వేల విలువచేసే దాయే.. వాళ్లు ఏమైనా కరాబు చేస్తే ఏం చేస్తాం. అన్న భర్త తో-రేపే వస్తాను అన్న దండి. ఇవ్వాల్టికి వారం రోజులు అవుతుంది.
నీ పనేఅంత. ఒకరికి పీతాంబరం ఇస్తావ్. ఇంకొకరికి నాను ఇస్తావ్. ఇలా అయితే ఎలా? అని భర్త అనడంతో... అయిన ఆలస్యమైంది. రేపో , ఎల్లుండో రాకపోతుందా అన్నదిసుశీల. నీ అటువంటి ఆమె పీతాంబరం ఇచ్చి పీట ఎంబడి తీసుకెళ్ళింది.
పీట ఎందుకు తీసుకెళ్ళింది తాతయ్య అన్న మనవడితో-
ఆమె కూర్చున్న దగ్గర వేసే టందుకు. ఎందుకు తాతయ్య. తన పీతాంబరం కరాబు అవుతుందని, పీతాంబరం ఇచ్చిన ఆమె ను-ఈమె వెంబడి ఎందుకు తిరుగుతున్నావ్ అనగా ఆ పితాంబరం నాది అన్నదట.
పీతాంబరం తీసుకెళ్లి నామే.. సిగ్గుతో మళ్ళీ ఎప్పుడు ఈమే దగ్గరకు పీతాంబరానికి రాలేదట. అన్న తాతయ్య తో..
నానమ్మ కూడా పీట తీసుకవెళితే బాగుండు అని మనవడు అనేసరికి, తాతయ్య నవ్వగా-బాగున్నావు రా తాతకు దగ్గటుల అనుకుంటూ రుసరుసలాడుతూ ఇంట్లోకి వెళ్లింది నానమ్మ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి