తిన్నావా తాతయ్య అని, బయట నుండి వచ్చిన మనవడు అడిగాడు.
తిన్న. ఇంతసేపు ఆగుతానా. నాభి కాడ చల్లబడితే నవాబుతో కొట్లాడవచ్చు. అన్నాడు తాతయ్య.
నాభి కాడ చల్లబడు డు అంటే ఏమిటి తాతయ్య.
కడుపులో ఏదైనా పడితే నవాబుతో కొట్లాడవచ్ఛు.
తెలంగాణలో వంద సంవత్సరాల క్రితం ముస్లింల పరిపాలన ఉండేది. నవాబులు అనగా దొరలు అన్నమాట.
నవాబుల తో మాట్లాడడం అంటే మాటలా.. ఎంతో ధైర్యం కావాలి. అటువంటిది-ఆకలితో ఉంటే ఇంకేం మాట్లాడతాం.
బాగుంది తాతయ్య సామెత.
నవాబు తోని ఏమి అవసరం తాతయ్య.
ఏమైనా పని పడి నవాబుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నమాట.
ఈ సామెతలు అన్నీ అనుభవాలతో వచ్చినవే నా తాతయ్య.
అవును. ఒక్కొక్క సామెత గురించి రాయ తలచుకుంటే నోటుబుక్కు నిండుతుంది అన్నాడు తాతయ్య.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి