"చెట్లు-లోకానికి మెట్లు":--చైతన్య భారతి పోతుల(ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)హైదరాబాద్--చరవాణి:-7013264464

            (1)
కొమ్మ ఒకటి నాటింది
ప్రేమతోడ పెంచింది
తన మదిని దోచింది
హృదయంలో నిలిచింది
          (2)
ధరణి అంతా పచ్చగా
చీరకట్టు సొంపుగా
కనికట్టు చేయగా
కనువిందు చేసెనుగా
          (3)
మా తోటలో బంతులు
మనసు దోచే మల్లెలు
పచ్చని చేమంతులు
అలుముకున్న కాంతులు
          (4)
అవనికి చెట్లoదం
తోటకు పూలందo
మాటలు మకరందం
జీవిత పరమానందం
          (5)
తరువు లేని లోకమందు
వానరాక దుఖఃమందు
భవిత అంధకారమందు
మొక్కలు నాటు ముందు
          (6)
మొక్క ఒకటి పెట్టేను
ఆక్సిజను ఇచ్చేను
ఆరోగ్యము పెరిగేను
ఆయువునే నిలిపేను
        (7)
అవని చెట్లు నరకొద్దు
అంధకారం చేయొద్ద
భవిత పాడు చేయొద్ద
చెట్ల తోడె మనకు కద్దు
       (8)
ఇంటి ముందు మొక్కలు
బడిలోనా మొక్కలు
దారిగుంట మొక్కలు
నీడనిచ్చే మొక్కలు
         (9)
చెట్లేమో నాటితంట 
ఫలములే ఇచ్చనంట
ఆకలేమో తీరునంట
ఆనందం మిగిలెనంట
        (10)
పచ్చదనం రక్షణ
హరితహారం శిక్షణ
చేయరాదు భక్షణ
మనకు అది రక్షణ