*ముత్యాల హారాలు*:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

1. తొలకరి పలకరింత
     పుడమి తల్లి పులకరింత
     రైతు ఆశలు కొండంత
     చివరకు మిగిలె కాసింత

2. దూరమైన బంధాలు
     కనిపించని స్నేహాలు
     పొడసూపని ఆశలు
     పొగచూరిన బ్రతుకులు

3. ముక్కుకుమూతికి మాస్కులు
   పిల్లలు పల్లెలు పెద్దలు
   కడుగుము కాళ్ళూ చేతులు
   లేదంటె నూకలు చెల్లు

4.  కుదేలైనా నగరాలు
      కృంగిన వ్యాపారాలు 
      చెదిరిన జీవితాలు
      కరోనా విలయాలు

5. కోవిడులొ వ్యాయామము
     చేయు ప్రాణసంకటము
     ఇవ్వాలి విరామము
     విశ్రాంతితో ప్రాధాన్యము

6. వారం విశ్రాంతి పెట్టు
    ఆపై చిన్నగా పట్టు
    యోగాసనాల పట్టు
    వత్తిడి దూరం పెట్టు

7.  క్షణికంలో వేశాలు
     చెరసాల జీవితాలు
     అయినవారికి దూరాలు
     ఇక పశ్చాత్తాపాలు

8. పెరిగిన సోమరులు
    వృద్ధిలో ఊబకాయులు
    అతినిద్రతో ఫలితాలు
    లాక్దౌనులో ఫలితాలు

9.  సెల్ఫోన్ గేమ్స్ రాత్రులు
     అర్ధరాత్రి సరదాలు
     పొద్దస్థమానం నిద్రలు
     పెడదారిన జీవితాలు

10.ఆన్లైన్లో పాఠాలు
     వాట్సాప్లో చాటింగులు
     నిర్లక్ష్యంతో పెద్దలు
     పెడదారిన పిల్లలు