మాట మా ట్లాడడం నైపుణ్యం. ఎందుకు చెబుతున్నావ్ తాతయ్య.
ఇరుగుపొరుగు తో, స్నేహితులతో బాగా ఉండాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి.
బాగా చెప్పావు తాతయ్య. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎప్పటికీ ఎవరితోనో ఒకరితో కొట్లాడుతునేఉంటుంది.
ఆమేకొట్లాడుడేకాక, ఈ ఊరు మంచిగా లేదు. ఇంకే ఊరికైనా వెళ్దాం అని వాళ్ళ ఆయనతో అంటుంది.
అది కాదు రా. ముందు మనం మంచిగా ఉండాలి. తరువాత ఎదుటి వారి గురించి మాట్లాడాలి. అన్నాడు తాతయ్య.
బాగా చెప్పావు తాతయ్య. మా ఫ్రెండు వాళ్ల నాన్న కూడా ఆమెకు ఇదే చెబుతుంటాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని,
బాగా చెప్పాడు ఆయన సామెత. అన్నాడు తాతయ్య.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి