పీడిత ప్రజల గొంతుగా మారి
తెలంగాణ ప్రజల కన్నీరును
అగ్నిధార గా మలిచిన మహాకవి
తిమిరంతో సమరం చేసి
నిరంకుశ నిజాం పాలనను నిరసిస్తూ
ధ్వజమెత్తిన ప్రజా సింహం
భూస్వాముల దౌర్జన్యాలకు ఎండగడుతూ
ధనవంతుల దుర్మార్గాలను ధ్వంసం చేస్తూ
దగ్ధమైన బతుకులలో చైతన్యం నింపిన అభ్యుదయ కవి చక్రవర్తి
పద్య పట్టు లో ప్రావీణ్యం సాహిత్య గాంబీర్యం
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కళాప్రపూర్ణ
తెలంగాణ తల్లి ఆరాధ్యుడు గా
ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించి
అందరికీ ఉత్తేజం నింపిన ఉద్యమ స్ఫూర్తి
గజల్ నీ తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించి
అనేక ప్రక్రియలకు ఆద్యం పోస్తూ
కవన రంగంలో సాగిన సాహితీవేత్త
తెలంగాణ దాశరథి సుప్రసిద్ధుడు
అందరి హృదయాల్లో నిలిచిపోయిన చిరస్మరణీయులు..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి