1
అధికార ధనములు పెంచును అహము
దాన ధర్మములు పెంచును గౌరవము
సుగుణం లేని మనిషి మృగము
ఆ మృగంతో స్నేహం నరకము
నాదు మాట నిజము నారసింహ...!
2
ఓ అక్షరమై నువ్వు నడిస్తే
నడిచినంత దూరం నువ్వు నిలిచిపోతావు
ఓ శిలకు నువ్వు రూపమిస్తే
ఆ రూపంలో నువ్వు పూజ్యుడవైతావు
నాదు మాట నిజము నారసింహ...!
3
జన్మము నీదే మరణం నీదే
ఆకలి నీదే ఆరాటము నీదే
ఆశ నీదే ఆత్రుత నీదే
బతుకు నీదే బరువు నీదే
నాదు మాట నిజము నారసింహ...!
4
నీటిలో చేప దాహం ఎరుగదు
బావిలో కప్ప బయలు ఎరుగదు
అన్నీ తెలిసినవాడు ఆశ పడ్డడు
అత్యాశ పడ్డవాడు బాగు పడ్డడు
నాడు మాట నిజము నారసింహ...!
5
కాయం మురిగితే కాలం చెల్లును
చక్రం ఆగితే రథం ఆగును
బాగు చెడితే బతుకు చెడును
చెడిననాడు అంతా దూర0 అగును
నాదు మాట నిజము నారసింహ...!
6
కొన్ని అపార్థాలకు ఆవేదన వేరు
యవరిస్వార్థాలకు వారి దారులు వేరు
ఈ ధరణిలోన ధన్యులు వేరు
వారు నడిచే బాటలు వేరు
నాదు మాట నిజము నారసింహ...!
7
దైవము నడిచే మనిషై చూడు
మరుగై తాను శిలయ్యేను చూడు
అది చూడగలిగితే ధన్యుడవు నీవుచుడు
నాదు మాట నిజము నారసింహ...!
8
ఏడ మచ్చలేని మనిషి లేడు
ఆశ లేని మనస్సు లేదు
ఆకలి లేని జీవి లేదు
కర్మఫలం పొందనిదే మోక్ష0 లేదు
నాదు మాట నిజము నారసింహ..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి