చరణం కరుణ తరుణం కరణం
కం
చరణము బురదన తడిసే
తరుణంబాసన్న మాయె తన్మయ ముఖుడై
కరుణించిన వానలతో
కరణముతో హలముపట్టు కర్షక బుధులే
దత్తపది:-బలం కలం జలం స్థలం
కం
బలహీనత తొలగించెడి
స్థలమార్పిడి మనసుకెంతొ సంతస మిచ్చున్
కలకలలాడే మొక్కలు
జలముండిన బ్రతుకు గాద జగడం బేలన్
దత్తపది:- శ్వాస ధ్యాస బాస హాస
కం
శ్వాసుంటెనె ప్రాణంబౌ
ధ్యాస నిలుపు శ్వాస పైన ధ్యానము తోడన్
బాసర వాసిని కృపతో
హాసముగా బ్రతుకు సాగి హాయిని కూర్చున్
దత్తపది:- భావ జీవ చేవ దేవ
కం
జీవన గాధలు యెన్నో
భావననే మార్చి మనిషి బ్రతుకును దిద్దున్
దేవత దయనీకున్నను
చేవను దండిగనె నొసగు జీవితమందున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి