అంశం:-కరువులోని కష్టాలను వర్ణించుట
చ.
సరియగు నీటి సంపదయె చక్కని పంటకు సాధికారతై
కరువును బాపుచుండు మరి కష్టము లేదని కర్షకుండికిన్
నిరతము సేవజేయుటకు నీటిని పంచెడి కాల్వలుండినన్
మరలని ధ్యాస బెట్టుకొని మౌనిగ రెక్కలు దారపోయునే
ఉ.
వానలు లేకవాడినవి పచ్చని పైరులు చెట్లు చేమలున్
కానల జీవరాసులకు గడ్డికి నీటికి లోటులేర్పడన్
నౌనన పృథ్విజూసె గగనానికినెర్రెల కూర్పుకోసమై
దీనుల బాధలెన్నటికి తీర్చగ వత్తువొ శంకరామరిన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి