వర్ణన:-వరద భీభత్సాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 చ.
వడివడితోడ వచ్చెనిటు వర్షము కుంభపు మేళవింపుతో
పడిపడి ముంచుచుండె గద పాకల కుంటలనన్ని నీటితో
నడచుటసాధ్యమాయె పురనౌకలు మింగెడి ధోరణే కనన్
మడుగులు పొంగి పొర్లెనిక మారణహోము నాపురాశివా!
వర్ణన:- వరద భీభత్సాలు
చ.
ప్రళయము కాపు గాసిజల వాహిని వానగ వచ్చుచుండెనే
కళకళలాడుజీవులకు కష్టపు కోరలు జూపుచుండెనే
మిళితము గాకతప్పదని మిక్కిలి భీకర నుత్సవంబుతో
దళపతి వోలె సాగినది దండిగ వర్షము చూడరాశివా!
వర్ణన:- వరద భీభత్సాలు
కం
వరణుని కాగ్రహమొచ్చెనొ
జరజర కురిపించుచుండె జలవాహినినే
వరదలు ప్రతివీధితిరిగి
బురదల బీభత్సమాయె బోళా హరుడా!

కామెంట్‌లు