వాసవి కన్యకా పరమేశ్వరి:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
చెంతనెమందిరంబుమనసెంత ప్రశాంతతకూర్చునో గదా
చింతలు బాపుకన్యకయె చిత్రముగా సెలవంటుజెప్పెనా
వింతకరోనవల్లగుడి వెల్గుల జాడలు మందగించెనే
సంతసమంత నింతులకు చల్లని నీడ కరీంనగర్ గుడిన్
ఉ.
అమ్మకు పూలమాలలను నర్పన జేయుచు సంతసించగా
కొమ్మలకంతకన్యకయె కోరిన దీవెనలందజేసునే
మమ్ముల చూడమంచు తన మాతగదల్చిన భక్తవర్యులన్
చెమ్మను దూరముంచెగద చింతలనన్నియు తీర్చుకన్యకై
ఉ.
చల్లని చూపుతోకనులు శాంతపు వెన్నెల జిమ్ముచుండగన్
పిల్లలు పెద్దలంతయును పెన్నిధి నీవని మ్రొక్కుచుండగన్
పల్లము నీరుబారినటు పావని చూపుల జిక్కుకోని యీ
తల్లిని వేడుచున్ జనులు తామసినంతను దాటుచుండిరే

కామెంట్‌లు