ఉదయం;-: *బాకి నారాయణ* *హైదరాబాద్* *చరవాణి:9440065312*

 తే.గీ
ఉదయం మెప్పడు కొత్తదే వుర్వి లోన
శక్తి యుక్తులు మార్చుతూ సాగ వలయు
ప్రకృతెప్పుడు మారుతూ పాటు వేయు
పాటు నెదిరించి నిలిచేటి బాట వెదుకు
తె.గీ
పనులు పాతవి యైనను బలము పెంచు
నిన్న వుండిన స్థితులన్ని నేడు మారు
రెక్క లొచ్చిన పక్షి లా రివ్వుమంటు
తూము విడిచిన నీరులా దూసుకెళ్ళు