*ప్రతి ఒక్కరి జీవితం అందమైన జీవితం గా మార్చుకోవచ్చు. తను ఊహించిన కలను నిజం చేసుకోవచ్చు. ఆసక్తిని ఏ శక్తీ అడ్డుకోలేదు అని నిరూపించిన పుస్తకం ( ఐనా... నేను ఓడిపోలేదు )*
*ఒక రోజుకు ఐదు రూపాయల కూలీ సంపాదించే వ్యవసాయ కూలి మహిళ నేడు అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని. మరెందరికో ఉద్యోగాన్ని అందిస్తూ ముళ్ళ పొదలు లాంటి జీవితం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన కళ్ల ముందు కనిపించే ప్రత్యక్షసాక్షి శ్రీమతి దూదిపాల జ్యోతిరెడ్డి. పుట్టింది ఒక పేద రైతు కుటుంబం అది వరంగల్ జిల్లా నర్సింహులగూడెంలో..... వివాహం భర్త మైలారం మారుమూల గ్రామంలో,......నేడు ప్రస్థానం అమెరికా వరకు*
=================
*అమ్మ చనిపోయింది అని చెప్పి ఒక అనాధగా బాలసదన్ లో చేరి విద్య అభ్యసించింది. ఆ క్రమంలో ఎన్నో కష్టాలను దిగమింగి ఆ తర్వాత ఉమ్మడి కుటుంబంలో పెళ్లి అనే బంధం తో చేరి సుడిగుండంలో దిగిన తర్వాత కష్టాలు తక్కువా మరి.. ! తోటి కోడలు పోరు, అత్తపోరు, ఎన్నో అవమానాలు, చీదరింపులు, పేదరికం, చిన్న వయసులో ఇద్దరు పిల్లలకు తల్లిగా, దిక్కుతోచని పరిస్థితిలో తను చేసిన ఒకే ఒక ప్రయత్నం ఆత్మహత్య వరకు దారితీసినా కాని గుండెను దిటవు చేసుకుని అదే ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోక పోవడం సాధించాలనే సంకల్పంతో ముందుకు వేసిన అడుగు ఈరోజు మరి ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది. నిజం చెప్పాలంటే తన జీవితం ఒక అద్భుత పాఠం. వినడానికి ఒక సినిమా కథ లా అనిపించినా ఇది వాస్తవం. దాదాపు సినిమాలలో రెండు నుంచి మూడు గంటల కాల వ్యవధిలో కథానాయక, కథానాయకుడు కడు పేదరికం నుండి ధనవంతుడిగా మారటం ఎన్నో సినిమాలలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అది సినిమాకు పరిమితం అయి ఉండొచ్చు. వాస్తవ ప్రపంచంలో కళ్ళముందు సినిమా చూపించింది. మన జ్యోతి రెడ్డి. తన జీవితంలోని అంశాలతో తను రాసుకున్న ఆత్మకథ పుస్తకం ఎన్నో లక్షల కాపీలు అమ్మడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందులోని తన జీవిత విషయాలను కొంతవరకూ పాఠ్యపుస్తకాలలో పాఠాలుగా డిగ్రీ, పాలిటెక్నిక్ లలో చేర్చడం మరో చెప్పుకోదగ్గ విషయం.*
ఇద్దరు చంటిపిల్లలకు పాలు అందించలేని దిక్కుతోచని దీన స్థితిలో తను ఎదుర్కొన్న కష్టాలతో పాటుగా, సాధించాలనే సంకల్పం తో.......
తన జీవిత ప్రయాణాన్ని ఒకసారి తెలుసుకుందామా...
రాష్ట్రం, వరంగల్ సమీపంలోని నర్సిమూలగూడెంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఇంట్లో చదివించడానికి స్తోమత లేనందున ఆమెకు, ఆమె చెల్లిని బాలసదన్ ( సెమీ ఆర్ఫాన్ స్కూల్ లో చేర్పించారు. . ఎలాగోలా పదవతరగతి పూర్తి చేశారు. చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా ఇంట్లో పెద్దోళ్లు వినలేదు. ఇంటర్మీడియెట్ సమయం లో అయినా పట్టించుకోకుండా పెళ్ళి చేసేసారు. ఇద్దరు పిల్లలు. ఉమ్మడి కుటుంబానికి తోడైన పేదరికం. ఈ పరిస్థితుల్లో రోజూ వ్యవసాయం పనులకోసం పొలానికి వెళ్లడమే జ్యోతిరెడ్డి దినచర్య. సాయంకాలానికి ఇంటికి చేరి పిల్లలతో గడపడమే తెలుసు. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం వేరుపడింది.
భర్త ఇంటి బాధ్యతలనుండి తప్పుకున్న కారణంగా ఆమె చంటి పిల్లలతో ఇంటి బాధ్యత ఎత్తుకోవలసి వచ్చింది. అప్పుడు నెహ్రూ యువ కేంద్ర అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దారి కనపడింది. ఆ సంస్థ పల్లెల్లో నైట్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. దాంట్లో టీచర్ గా అవకాశం వచ్చింది. అప్పుడు జ్యోతి రెడ్డి జీతం నెలకి 120 రూపాయలు. ఆ తర్వాత అదే సంస్థలో ప్రమోషన్. ఉన్న ఊరు మారాల్సి వచ్చింది. జ్యోతిరెడ్డి కుటుంబం హన్మకొండకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఈ మార్పు ఆమె భర్తకు నచ్చకుండానే జరిగింది. హన్మకొండ నుంచి వేరు వేరు ఊళ్లకు ప్రయాణించడంలో తన జీవిత ప్రయాణం వెతుకున్నారు జ్యోతి. అప్పుడే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాసయ్యారు. ఆ తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది. జీవితంలో పెద్ద మార్పంటూ వచ్చింది అక్కడే. ట్రెయిన్లో చీరలు అమ్మారు. స్కూల్ టీచర్ గా తన కెరీర్ కొనసాగించారు
" అమెరికా వెళ్ళాలి అనే ఆలోచన "
====================
అమెరికా నుంచి తెలిసిన వాళ్ల అమ్మాయి హన్మకొండ వచ్చారు. ఆ అమ్మాయి ప్రోత్సాహంతో ఆమె అమెరికాకు ప్రయానమయ్యింది. ఆ స్నేహితురాలి మాటలు జ్యోతిరెడ్డి జీవితాన్ని మర్చేసింది. అప్పటికే హైదరాబాదులోని హిమాయత్ నగర్లో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయ్యారు. పాస్ పోర్ట్ కూడా అప్లై చేశారు. అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మొదటిసారి వీసా రిజెక్ట్ అయింది. ప్రయత్నంలో లోపం లేదు కనక మరోసారి ప్రయత్నించడంలో తప్పులేదని అనుకున్నారు. కానీ విజిటింగ్ వీసాలో అమెరికా పంపడానికి తెలిసిన వాళ్లు ఒప్పుకున్నారు. అమెరికాలో ఒక క్యాసెట్ షాప్ లో సేల్స్ గార్ల్ గా జాయిన్ అయ్యారు. రోజుకి 5 డాలర్ల ఉద్యోగం. అలా జ్యోతి అమెరికా కెరీర్ ప్రారంభమైంది. ఆ షాప్ కి వచ్చిన ఓ వరంగల్ ఎన్నారై ఆమెను చూసి మీరు టీచర్ కదా అని అడిగారు. మీరిక్కడ ఏం చేస్తున్నారు.. మీ స్కిల్ కి ఇది తగిన ఉద్యోగం కాదని చెప్పేసి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి జ్యోతిరెడ్డికి ఫోన్ చేసి రిక్రూటర్ ఉద్యోగం యిప్పించాడు. సాఫీగా సాగుతున్న ఉద్యోగం. ఇంతలో 5 వేల డాలర్ల ఆఫర్ వచ్చింది. ఓ రిక్రూట్మెంట్ కంపెనీలో 50 శాతం షేర్ ఇస్తామన్నారు. ఎలాంటి ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడకి వెళ్లిపోయారు. కానీ ఆ ఉద్యోగంలో చేరాక తెలిసింది. ఆ కంపెనీ వాళ్లు లాభాల్లో యాభై శాతం అన్నారు. దీంతో డీల్ వర్కవుట్ కాలేదు. అప్పటికి వర్జీనియాలో నెలకి 5వేల డాలర్ల ఉద్యోగం పోయి, ఇటు డీల్ జరక్క ఏం చేయాలో పాలుపోలేదట ఇక ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది.
అమెరికా గడ్డ పై .... ఇండియా బిడ్డ
ఆమె ఫినిక్స్ లో కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (Key Software Solution) అనే సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఏటికేడు ప్రయాణం.. ఒక్కో మజిలీ దాటుతూ వచ్చింది. ఇప్పుడు Key Software మిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. పూర్తిస్థాయి సేవకార్యక్రమాలకు జ్యోతి టైం కేటాయిస్తున్నారు. ఆర్ఫాన్ స్కూళ్ల ఏర్పాటుపై పోరాటం చేస్తున్నారు. తనతో కలసి వచ్చేవారికి ఆహ్వానం పలుకున్నారు.
మరెన్నో... పురస్కారాలు
కంపెనీ పెట్టిన తర్వాత ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎన్నారై సంఘాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నుండి శాంతిదూత అవార్డు వచ్చింది.
ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా బయటకు తీసి ఈ యాంత్రిక జీవితంలో ఎలా ముందుకు పోవాలో ఏ విధంగా తన గమ్యాన్ని చేరే క్రమంలో వచ్చే ఒడిదుడుకులను ఈ ప్రపంచానికి తెలియజేసి అద్భుత కరదీపిక “ ఐనా నేను ఓడిపోలేదు “ శ్రీమతి జ్యోతి రెడ్డి ఆత్మకథను పాఠకులకు అందించే క్రమంలో పుస్తకం మొదటి నుండి చివరి వరకు ఎక్కడా కూడా రచయిత వల్లీశ్వర్ చెబుతున్నట్లుగా లేదు. పుస్తకం మొత్తం కూడా పాత్ర నే పాఠకున్ని చదివించే దిశగా కళ్ళకు కట్టినట్లుగా పుస్తకాన్ని రాసారు
నేటి కాలంలో ఆత్మకథలను చదవాలి అంటే పాఠకులు కొద్దిపాటి వెనకంజ వేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకం ఇప్పటి వరకు లక్ష పైచిలుకు కాపీల ప్రచురణ జరిగింది అంటే అది పాఠకున్ని ఆ పుస్తకం చదివించే తీరుని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆసక్తిని ఏ శక్తి అడ్డుకోలేదని, ఆత్మవిశ్వాసం ముందు ఏదైనా భానిస కాకతప్పదని నేటి యువతరానికి నిలువుటద్దంలా నిలిచింది ఈ పుస్తకం “ ఐనా నేను ఓడిపోలేదు”... ఒక పేదింటి మహిళ పడ్డ కష్టాలను సాధారణంగా పుస్తకాలలో, కథలలో ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఒక కూలీ నుండి సాఫ్ట్ వేర్ కంపెనీ CEO గా ఎదిగిన జ్యోతి రెడ్డి ఆత్మకథ పుస్తకాన్ని పరిశీలిస్తే..... ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే సంఘటనలు తను ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, మాటలకు అందని భావోద్వేగాలు అక్షర రూపంలో రాసి నేటి యువతకు కనువిప్పు కలిగించే విధంగా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచేట్లుగా రచయిత పాఠకునికి అద్భుతంగా అందించారు.
ప్రధానంగా చెప్పాలంటే ఈ పుస్తకంలో జ్యోతి రెడ్డి గారు ఆత్మహత్య చేసుకోవాలి అని పూర్తిస్థాయిలో నిర్ణయించుకున్న తరువాత ఆ వ్యవసాయ భావి దగ్గర ఇద్దరు పిల్లలతో కలిసి తను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పే క్రమంలో జ్యోతి రెడ్డి గారి భావోద్వేగాన్ని పాఠకునికి చేరవేసే తీరుని, మైలారం నుండి అమెరికా వెళ్లి స్థిరపడి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని గా ( పేద తరగతి నుండి ఉన్నత స్థాయి గా ) ఎదిగిన మధ్యకాలంలో జరిగిన పరిస్థితులను, అవమానాలను, దశలవారీగా తను తన లక్ష్యసాధన కోసం, ఆ పేదరికాన్ని ఎదుర్కోవాల్సిన ప్రతి సంఘటనను చాలా ఉత్తమంగా పాఠకునికి అందించారు.
జీవితంలో ప్రతి యువతీ యువకులు చదవాల్సిన పుస్తకం. నేటికీ ఎందరినో మార్గదర్శిగా నిలిపి, ఆత్మవిశ్వాసానికి మరో పేరు గా నిలిచిన పుస్తకం... “ ఐనా నేను ఓడి పోలేదు “

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి