రామాయణం రామాయణం
రామమయం అయిన ఆయనం
రాముడు నడిచిన చక్కని మార్గం
అందులో చేరిస్తే దక్కునులే స్వర్గం
మానవ రూపంలో అవతరించే ఆ శ్రీరాముడు
ప్రజలందరి హృదయాల్లో స్థిరంగా నిలిచిన రఘు రాముడు
రామాయణంలో కథానాయకుడై ఇల నిలిచాడు
ధనస్సు విరిచి సీతాపతి యైఅలా గెలిచాడు
మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు
ఘన సందేశంతో లయమైన ఆయనం కాదు చేదు
ధర్మ మార్గాన్ని ఆచరించాలని ఈ గ్రంథం తెలుపు
మర్మ కర్మ స్వర్గాన్ని అందించి మన బంధాల్ని నిలుపు
ధర్మ ప్రతిష్టాపనే రామాయణంలోని విశిష్ట అంశం
సూర్యచంద్రులు ఉన్నంత వరకు దీనికి లేదు స్థానభ్రంశం
సదా జీవన మార్గదర్శియై ఈ గ్రంథం నిలుస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి