వైద్యో నారాయణ హరి
ఆరోగ్యంపై ఆ హరి గురి
పెట్టి పంపాడు వైద్యుల
గట్టి ధన్వంతరి ఆంధ్రుల !
ఆరోగ్యం మహాభాగ్యం తెలుసుకో
ఆరోగ్యంకై వైద్యులను కలుసుకో
సూచించిన మందులనే వేసుకో
వేధించే రోగాలను తొలగించుకో !
స్టైలిష్ గా మనకోసం నిరీక్షిస్తరు
స్టెతస్కోప్ తో రోగాన్ని పరీక్షిస్తరు
దేహమందలి రోగాలనయం చేస్తరు
సందేహాలను వారుమాయంచేస్తరు
ప్రాణాలను కాపాడే సంజీవి ప్రదాతలు
నిస్త్రాణం తొలగించే మన విధాతలు
మందులతో రోగాలను నయం చేస్తారు
పోయే ప్రాణాలను నిలబెట్టి జీవం పోస్తారు !
వైద్యో నారాయణ హరులకువందనం
నైవేద్యంతో చేద్దాంమనం వందనం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి