అన్నదాత రైతు- ఆకలి కేకలు :-యడ్లశ్రీనివాసరావు విజయనగరం జిల్లాచరవాణి:9493707592

 గుండెల్లో గోదారి
కళ్లో యేరువాక
నడకల్లో రాదారి
కన్నీరై తెప్పజారి
దిగులుతో
వేదనతో
క్రుంగిపోయి
రైతు అప్పులైపోయి
తల్లడిల్లీ
ఎరువు మందు
మంచినీరని తలచి
త్రాగినాడు రైతు
దిగులుతో
బ్రతుకు
నడవక
పరలోకం పోయాడు
పదిలంగా కాసేపు
అక్కడ కాసేపు
గడుపుదామని
ప్రభుత్వాలు ఎన్నివచ్చినా
రైతుల తలరాతలు
మారవా
ఆత్మహాత్యలు ఆపవా
ఇక వారి గతులు మార్చరా...