ఆమె అతడుఅర్ధనారీశ్వర దాంపత్యంఏడాదికో పాపరెప్పపాటులో రెండేళ్ళువాళ్లిద్దరూ!వాళ్ళ కిద్దరు!!అతన్ని కలిసాను...మాటల మడత విప్పానుఫోర్త్ క్లాసు జీవితాలుఎన్ని ప్లాష్ లైట్లయినావెలుగు నిండని వెతలుభూమికి బుక్కకి ముడిపడనిముఖచిత్రం గీసి ముందుంచానుఅతన్ని మళ్లీ కలిసాను..చదువు ఓ ఆకాశ పుష్పం!పిల్లల కది కొనలేవన్నానుపసికాయల భారంతోమొక్కను కూల్చొద్దన్నాను"ఆడపిల్ల లిద్దరూవంశోద్ధారకుడొద్దా?”ముసలి గొంతుఆడ మగ అంతరాల కుతంత్రాలు కాదుగీత దాటిన సీత అష్ట కష్టాలు పడలేదా!అపరిమిత మేదైనా అనర్ధదాయక మన్నానువస్త్రం వసతి వనరులు కరువైప్రతి క్షణం శ్వాసించే ప్రాణవాయువు మితంపరిమిత కుటుంబం పగడాల హారమనిసూర్య చంద్రులోలే బిడ్డలిద్దరూ ముద్దన్నానుజ్ఞానోదయమై కడకు ఆమోదం తెలిపెనతడువేసెక్టమి చేసుకుని ఆనంద సంద్రంలో ఓలలాడెనుఈ సారి అతన్ని కలిశాను..పిల్లల భవితవ్యానికి ప్రణాళికతోసమర్థవంత కుటుంబ సంక్షేమం కోసంఅంతరంగ తలుపులు తెరిచినసంపూర్ణ బాధ్యతల మార్గదర్శకు డతడు(11జులై, ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా)
వాళ్లిద్దరూ! వాళ్ళ కిద్దరు!!:-కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య పర్యవేక్షకుడు,చిట్యాల,నల్గొండ,9542236764
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి