తల్లి భారతికి వీరతిలకం దిద్దే త్రివర్ణ జెండాశాంతి శౌర్యం త్యాగాల పుణ్యచరిత జెండాదేహ మిచ్చిన దేశ సంరక్షణ కోస మీ జెండాఅమర వీరుల త్యాగ ఫలం చాటే ఈ జెండాసస్య శ్యామల భరిత హరిత వర్ణంవిశ్వ శాంతికి మూలం ధవళ తేజంకాషాయం త్యాగ నిరతి అమోఘంసత్య అహింస ధర్మ ప్రబోధ ధ్వజంనరనరం దేశభక్తి ఉరకలెత్తించే పతాకంశత్రుమూక భరతం పట్టే రెపరెపల పతాకంభారత మాతకు పుష్పాభిషేక మీ పతాకంబానిస విముక్తి సంకేతం జాతీయ పతాకంఆబాల గోపాలానికి అండదండ ధ్వజంజాతి సమైక్యతకు ప్రతిరూప మీ ధ్వజంమువన్నెల పతాకమా!సహస్ర వందనం!భిన్నత్వంలో ఏకత్వంగా ఎగిరే ఈ జెండాసత్య అహింసల ధర్మ ప్రబోధం ఈ జెండాప్రాంత భాష కులమతాల కతీతం జెండాజెండా రూపశిల్పి పింగళి వెంకయ్యా!జోహార్!🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳♦️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳(జూలై4,జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్థంతి సందర్భంగా)
ధర్మ ప్రబోధ ధ్వజం:-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్యపర్యవేక్షకుడు,చిట్యాల, నల్గొండ,9542236764
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి