1 విద్య కీర్తిని ఇస్తుంది
విద్య భోగాన్ని ఇస్తుంది
విద్య మనిషికి రూపాన్నిస్తుంది
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
2 శీల నిర్మాణమే విద్య
సర్వరోగ నివారిణే విద్య
ఆత్మ సాక్షాత్కారమే విద్య
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3 విద్య లక్ష్యం సత్యాన్వేషణ
విద్య లక్ష్యం సర్వతోముఖాభివృద్ధి
విద్య లక్ష్యం సార్వజననీక రణం
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
4 జీవిత సమస్యలను పరిష్కరించును
మానసిక శక్తులను అభివృద్ధి చేయును
దివ్యత్వపు పరిపూర్ణతను వెలికితీయును
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
5 మానవజాతి ప్రగతికి సాధనం
మూర్తిమత్వ వికాసానికి సోపానం
మంచిగా బ్రతకడానికి ఆధారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి