కార్తీకమాసంబు కడు మహత్వంబు:-పిల్లి.హజరత్తయ్య--సింగరాయకొండ, ప్రకాశం జిల్లాసెల్....9848606573

 1 కార్తీక మాసం మహి మాన్వితమైనది
శివ కేశవులకి ప్రీతికరమైనది
స్నానములకు, వ్రతములకు శుభప్రదమైనది
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
2) వేదములకు సమానమైన శాస్త్రములు
గంగకు పుణ్యప్రదములైన తీర్థ ములు
కార్తీకమాసమునకు సమానమైనవి లేవు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
3) కార్తీకదీపాలు నదిలో వెలిగించు
కేదారేశ్వర వ్రతం గావించు
నదీ స్నానాలు ఆచరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
4) కార్తీకపౌర్ణమికి విశిష్టత ఎక్కువ
శివుని అనుగ్రహం కలుగు
సకల దోషాలు తోలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
5) ఉపవాస దీక్షలు ఆచరించు
స్నానం పుణ్యఫలాలను ప్రాప్తించు
దానం సౌభాగ్యాలను కలిగించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!