తెలుగు బాల పదాలు: అ ష్ట మూ ర్తి - శి వు డు "శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:. 99127 67098

 👌అష్ట మూర్తి శివుడే
     కామితార్ధ ప్రదాత
     సర్వ జగతికి త్రాత
                ఓ తెలుగు బాల!
👌పరమేశ్వరుడు.. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము; సూర్యుడు, చంద్రుడు; జీవుడు.. అనెడు, యెనిమిది రూపము లలో విరాజిల్లు చున్నాడు. కనుక, అష్ట మూర్తి, సాంబ శివుడు!
👌సకల ప్రాణి కోటికి.. కామి తార్థము లను అనుగ్రహించు చున్నాడు. ఈ చరాచర జగత్తును సంరక్షించు చున్నాడు, అష్ట మూర్తి యగు, జగ దీశ్వరుడు!
           * * * * *
         ( అష్టవిధ ప్రకృతు లతో కూడిన పురుషోత్తముడే ... శ్రీ ఉమా మహేశ్వరుడు! అందువలన, ఆగమ వేత్తలైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివలింగ మూర్తియైన స్వామి వారిని.. "ఓం సాంబ శివాయ, అష్ట మూర్తయే నమః", అని పత్ర పుష్పములతో పూజించు చున్నారు! )
కామెంట్‌లు