*సూక్తిసుధ*:-మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

 కం
జాడలుదెలియగమనుజులు
తోడుగనున్నట్టివారితొ స్నేహములే
వేడ్కలజూపునుధరలో
వీడుముమూర్ఖులతొమైత్రివేగమెనెపుడున్ 
తే.గీ
నీవుపయనించుపథమున-నీకుతగులు 
పూలుముల్లునుయెన్నియో-పుడమియందు
 ముళ్ళువేరుచేసినెపుడు- ముందు నడచి
విసుగుజెందకముదమున-విరులుగొనుము