..ఆవు(బాల గేయం.)బొమ్ము విమలమల్కాజ్ గిరి,9989775161

ఆవమ్మా !  ఆవు
తెల్లని చారల  ఆవు
కల్లాకపటమెరుగని
కామధేనువు అది

గడ్డినే మేయుచూ
కుడితినే తాగుతూ
పొదుగును నింపుకొని
పాలెన్నో యిచ్చును

పేడ,గోమయం నిచ్చి
ఫెన్నిదిగా నిలుచును
ప్రతి యింట పాడియై
ఆరోగ్యం అందించును

గోమతకు గౌరవంగా
పూజలను చేయంగా
పాపాలు తొలగిపోయి
పవిత్రతనే కలుగును