*పిల్లిపేరు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(మూడవభాగం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 9)
అందుకే మేఘమని అనవద్దు
"గాలి" అంటేనే ముద్దు
అవ్వ చెప్పిన అంతలోనే
తాత ముఖం ముడుచుకునే!
10)
గాలి ఏమి పేరుగలది
దానికి ఏమి శక్తిఉంది
ఆకులు కదిలించు కదా
కాని గోడను కదిలించగలదా!
11)
గోడపట్ల గాలి డాబు
అంతా పనిచేయదు బాబు
అయితేమన పిల్లిపేరు "గోడ"
అందాము మనము కూడ!
12)
అన్నాడు తాత నవ్వి
తనచేత్తో మీసము దువ్వి
తాత మాట విన్నఅవ్వ
బుగ్గలు నొక్కింది అవ్వవ్వ!
(సశేషం)