1.చంపకమాల
యతి,ప్రాస,పదము,అర్థము
యతి నియమంబులన్ తెలియ హాయిగ పద్యము వ్రాయవచ్చునే,
సతిపతులోలె ప్రాసలిల సాగగ యర్థము భావముల్ నిడన్,
నతులిడు జూడగన్ పదము నాణ్యత గల్గిన కావ్యశేఖరున్,
గతి మతి దప్పకుండ నిడ కైవస మౌనిల పద్యరాజముల్.
మర, కర , ధర, పర
2.చంపకమాల
మరణము తప్పదెప్పుడును మానవ లోకములోని జీవు లున్
కరముల సంపదుండినను గమ్మను జేరును బంధు జాలమున్,
ధరణిన ప్రాణమున్నపుడు త ప్పక దానము జేయనెంచు చున్
పరహిత మైన సేవపరి పాటిగ సల్పిన కీర్తి గల్గునో.
దత్తపదులు:--మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి